Wednesday, 16 September 2015

సంద్రం ముందు నేనా..

సంద్రం ముందు నేనా..
కాదు కాదు
నా ముందే సముద్రం..
కడలిలో ఏడాదికో తుపాను
నువు కాదన్న క్షణం నుంచీ
నా మదిలో పెను కల్లోలమే..
సునామీని తట్టుకుని నిలుచున్నా..
నీ ప్రేమ రాహిత్యం నన్ను ముంచేస్తోంది..

మనసు లేకుంటే నే నయం..
ఉండీ.. ప్రేమించక పోవడం నరకం..
నువ్వా నరకం గుమ్మంలో వుంటే..
నేను మాత్రం ప్రేమ స్వర్గంలో ఎలా విహరించనూ..
నరకమే నీ లక్ష్యం అయితే..
ఓ ప్రేమా
అది కూడా నీ రాకతో స్వర్గమే నాకు

--నాగ్

No comments:

Post a Comment