Wednesday, 16 September 2015

గంజి నీళ్ళకు అంత రుచి ఎలా వచ్చింది..

గంజి నీళ్ళకు అంత రుచి ఎలా వచ్చింది..
పచ్చిమిరపకు ఆ.. ఘాటు ఎక్కడిదీ..
వుండండి... ఆకలిని అడిగి చెబుతా..!

కటిక నేల ఎంత మెత్తగా వుందీ..!
మడిచిన చేయి తలగడైందే.. ఎలా..
ఆగండి.. కమ్ముకున్న నిద్ర నడిగి చెబుతా..!

వెన్నెల చూస్తే.. ఆమె గుర్తొస్తోందే..
గుర్తొచ్చిన ప్రతి సారీ కన్నీరొస్తోందే.. ఎందుకు..!
వుండండి.. గాయపడిన గుండెనడిగి చెబుతా...!

--నాగ్

No comments:

Post a Comment