Monday, 14 September 2015

భయపడుతూ.. జంకు పడుతూ..

భయపడుతూ.. జంకు పడుతూ..
వణికిపోతూ.. ఒరిగిపోతూ..
చిమ్మచీకటి చాటున..
కటిక బండమాటున..
ఎంతకాలమిలా..
అడుగేద్దాం
ఒక అడుగుదూరం అయినా
తరుగుతుందిగా..
సమస్యను పూజిస్తే.. పెరుగుతుంది
తొక్కిపెట్టి నారతీస్తే.. పారిపోతుంది
బలహీనత మృత్యువైతే..
తెగింపు నీ వజ్రాయుధం
కుంగి పోకు నేస్తం..
ముందుంది నీ ప్రపంచం
అందుకోవడమే ఆలస్యం
వెయ్ అడుగు..
అడిగేవాడెవ్వడు

--నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment