Wednesday, 16 September 2015

అక్షర పుష్పాలు

అక్షర పుష్పాలు ఏరీ..
ప్రాస అందాల దారంతో గుది గుచ్చితే..
పదాల మాల అయ్యింది..
అది నీ మెడలో వేయాలని..
ఆశగా వస్తే..
నువ్వేమో కృత్రిమ చెమ్కీల దండతో
ఎదురొచ్చావు..
దండ చెదిరింది..
అక్షరపుష్పాలు నేల రాలి..
కన్నీటి బింధువులయ్యాయి..
శపించాలని తలచినా..
నా పెదాలు నీ పేరే పలుకుతున్నాయ్
అపాత్ర దానమని తెలిసినా.
నా మది నీ ప్రేమనే కోరుతోంది..
నిరీక్షణే ప్రేమకు పరీక్ష అయితే..
నా గెలుపు ఖాయం..

--నాగ్
 ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment