Wednesday, 16 September 2015

నా అక్షరాలు,, నా ప్రియురాళ్లు..

నా అక్షరాలు వెన్నెల్లో ఆడపిల్లలు కాకపోయినా
తలుపుమాటున కన్నెపిల్లలు
ప్రియుని రాక కోసం ఎదురుచూసే పడుచులు
కష్టమెరుగని కలల చిన్నారులు
సిగ్గుదొంతరల మాటున చిరునవ్వుల బాలలు
చిగురుటాకు పాదాల సవ్వడులు
పట్టుపరికిణీల రెపరెపలు..
కొంటే మరదల్ల అల్లరులు
ఊగే జడగంటల ఒయ్యారాలు
పల్లెపడుచుల కూనిరాగాలు
సెలయేటి ఒడ్డున కిలకిలలు
నా అక్షరాలు,, నా ప్రియురాళ్లు..

--నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

1 comment: