Monday, 14 September 2015

కడుపు కాలింది..

కడుపు కాలింది..
నోరు ప్రశ్నించింది..
ఫలితం..
కొరడా వీపుపై నర్తించింది..

కూలి తగ్గింది..
రక్తం మరిగింది..
ఫలితం..
పనికి ఉద్వాసన పలికింది

పని ఒత్తిడి పెరిగింది..
పెన్ను మొరాయించింది
ఫలితం
ఉద్యోగం ఊడింది..

సమస్య పెరిగింది..
కాలనీ నిలదీసింది..
ఫలితం..
తాగునీరు బందయ్యింది

ఎవరన్నారు.. ప్రశ్నించమని
ఎవరు చెప్పారయ్యా నీకు..
అన్యాయాన్ని నిలదీయమని
మీ ఎరుపు రాతలు ఇక్కడ..
కడుపులు నింపడం లేదు.
మీ రాజ్యాంగ నీతులు ఇక్కడ..
కన్నీరు తుడవడం లేదు..

ఇది ప్రజాస్వామ్యం..
ప్రజల ఇష్టంతో.. నెత్తినెక్కిన
నేతల స్వామ్యం..
ఇంతే.. నిరుపేదల బతుకు

--నాగ్

No comments:

Post a Comment