ఆకలి.,
నాకు నచ్చిన మాట..
నన్ను పెంచిన పదం
అదంటే నాకు గౌరవం
నాకు నచ్చిన మాట..
నన్ను పెంచిన పదం
అదంటే నాకు గౌరవం
బతకడం ఎలాగో నేర్పిన తండ్రి
బతికున్నానని నిత్యం గుర్తు చేసే తల్లి..
నాకు ప్రపంచాన్ని పరిచయం చేసిన గురువు
నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన స్నేహితుడు
ఆకలి.. ఆకలి
బతికున్నానని నిత్యం గుర్తు చేసే తల్లి..
నాకు ప్రపంచాన్ని పరిచయం చేసిన గురువు
నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన స్నేహితుడు
ఆకలి.. ఆకలి
అదే ఆకలి..
నా నెచ్చెలి.
పోరాడమని చెప్పింది..
పోరాటం నేర్పింది..
నన్ను ప్రేమించింది..
నా చేత ప్రేమించ బడింది..
అవును.. ఆకలి నా ప్రేయసి
నా నెచ్చెలి.
పోరాడమని చెప్పింది..
పోరాటం నేర్పింది..
నన్ను ప్రేమించింది..
నా చేత ప్రేమించ బడింది..
అవును.. ఆకలి నా ప్రేయసి
తనని తలవందే నేను లేను
నా డొక్క తడవనిదే తాను లేదు
నిత్యం నా వెంటే వుంటుంది..
ప్రేయసిలానే.. దుంప తెంచుతుంది..
అది లేనిదే.. నేను లేను
తన కోసమే ఈ పరుగు..
అగే వరకూ అలసే వరకూ..
ఆగి.. 'పోయే' వరకూ పరుగు
నా డొక్క తడవనిదే తాను లేదు
నిత్యం నా వెంటే వుంటుంది..
ప్రేయసిలానే.. దుంప తెంచుతుంది..
అది లేనిదే.. నేను లేను
తన కోసమే ఈ పరుగు..
అగే వరకూ అలసే వరకూ..
ఆగి.. 'పోయే' వరకూ పరుగు
--నాగ్
No comments:
Post a Comment