రైతుదెంత అదృష్టం..
తాను పేనిన తాడుకే వేళ్లాడుతాడు..
తాను కొన్న పురుగుల మందే తాగుతాడు
తన తోట కట్టెలలోనే కాలి బూడిదవుతాడు
ఎవరే విత్తు నాటినా..
చేసేది నష్టాల సాగే
మెట్ట.. పల్లం ఎదైనా..
రైతు చమటతోనే తడిచేది..
ఉచిత విద్యుత్ అన్నారు..
అదేమి చిత్రమో..
బోరు కరెంట్ పోతే..
రైతు 'దీపం' ఆరిపోయింది..
ఎకరాలకెకరాలు నాశనమయ్యాక
ఓదార్చే నేతలకు కొదవ లేదు..
పెట్టుబడి సంకనాకిపోయినా..
అప్పులు మాత్రం వసూలు తప్పదు
సర్కారే కాదు..
పురుగు మందూ కొత్తదే..
తాగక్కర్లేదు.. వాసన చూస్తే చాలు
పురుగు చచ్చిపోడానికి
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలుతాను పేనిన తాడుకే వేళ్లాడుతాడు..
తాను కొన్న పురుగుల మందే తాగుతాడు
తన తోట కట్టెలలోనే కాలి బూడిదవుతాడు
ఎవరే విత్తు నాటినా..
చేసేది నష్టాల సాగే
మెట్ట.. పల్లం ఎదైనా..
రైతు చమటతోనే తడిచేది..
ఉచిత విద్యుత్ అన్నారు..
అదేమి చిత్రమో..
బోరు కరెంట్ పోతే..
రైతు 'దీపం' ఆరిపోయింది..
ఎకరాలకెకరాలు నాశనమయ్యాక
ఓదార్చే నేతలకు కొదవ లేదు..
పెట్టుబడి సంకనాకిపోయినా..
అప్పులు మాత్రం వసూలు తప్పదు
సర్కారే కాదు..
పురుగు మందూ కొత్తదే..
తాగక్కర్లేదు.. వాసన చూస్తే చాలు
పురుగు చచ్చిపోడానికి
--నాగ్
No comments:
Post a Comment