Monday, 14 September 2015

మలయమారుతం..

సన్నగా..
మలయమారుతం..
చిమటల చిరు సంగీతం..
చెట్ల నీడల నృత్యం..
గాలికి ఊగే ఆకుల సవ్వడి..
వెన్నెల చీరకట్టి..
చీకటి కురులారబోసి..
చందమామ తోడుగా..
చిరుగాలి దరహాసంతో..
మిణుగురుల దీపంతో..
చేతులార చాపి..
నక్షత్రాల నడుమ.. నా దేవత..
నిశీది సుందరి..

ఒడిలో ఒదిగిపోనా..
 

--నాగ్

ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment