
పచ్చని భూములు లాక్కున్నారు..
పరిహారంగా కొత్త శ్మశానం విదిల్చారు..
మీ ముందు చూపుకు జోహారు..
రైతన్న చేరేది అక్కడికేనని ఊహించారు..
పొలాల్లో పరిశ్రమలు మీ ఎత్తుగడ..
ప్రతిపక్షంలో అరక దున్ని..
అధికారంలో పరిశ్రమలు నాటుతున్నారు..
మీ నేల మీదేనన్న మాట అటకెక్కించి
నోరెత్తినోడిని నడ్డి విరగ్గొడుతున్నారు..
పిల్లలు పారాడిన గూడు కూల్చేసి..
అగ్గిపెట్టిలాంటి గదిలో బతమన్నారు..
మీ నేతలు వందల ఎకరాలు కొంటారు
మా బక్కోల భూములు అమ్మాలంటారు
రాజైనా.. బాబైనా మీ పాలన అద్బుతం..
నేలనంటి మీ పాదాలకు వందనం
దయతో మీరిచ్చిన రుద్రభూమినైనా..
మాకొగ్గండి సామీ..
ఆక్రమించి దుమ్ముల ఫ్యాక్టరీ కట్టొద్దు
(కాకినాడ సెజ్ ఏర్పాటు నేపధ్యంలో రైతుల నుంచి సుమారు 10వేల ఎకరాలు బలవంత సేకరణ చేసిన ప్రభుత్వం.. సెజ్ గ్రామం నిర్మించింది.. కొత్తపల్లి మండలం మూలపేట వద్ద అధికారులు ఏర్పాటు చేసిన కొత్త శ్మశానం ఇది.. దీనిని ప్రారంభించడానికి ఎవరొస్తారో మరి)
No comments:
Post a Comment