Sunday, 13 September 2015

ఎలుగెత్తి అరవాలనుంది..

ఎలుగెత్తి అరవాలనుంది..
ఇది కాదు నా జీవితం అని..
వున్నోడు తింటాడు..
నాకైతే పెట్టడుగా..
కలిగినోడు.. కులుకుతాడు..
నాకు వాటా ఇవ్వడుగా..
అధికారముంటే.. అందలం ఎక్కుతాడు
నన్ను పక్కన కూర్చోనివ్వడుగా
మరెందుకీ నా పై ఈ దాష్టీకం..
అడుగడుగునా పెత్తందారీ తనం
కానీ లేదనా.. కులం కాదనా
బిగ్గరగా అరవాలనుంది..

ఒళ్లు పగిలినా.. గొంతు చిరిగినా..
నా పై నీ పెత్తనమేమిటని..
గళ్లా పట్టుకుని అడగాలనుంది..
నా గంజి నాదీ.. నా నేల నాది
నా జోలి నీకెందుకని..
తుండు దులిపి..
చేతులు కట్టి.. నేలను తాకే
బడుగు బతుకు నాకొద్దని
ఇది కాదు నా జీవితం
అని అరవాలనుంది..

అధికార మదగజం ముందు..
కుక్కలా అయినా .. మొరగాలనుంది
ఇది నా జీవితం కాదు అని..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment