ఏమే.. ఒసే అంటావ్..
నా పేరు మరిచావ్
ఏరా అంటే.. అమర్యాదంటావ్
పేరుతో పిలిస్తే..అసంప్రదాయ మంటావ్
నాకు లేదా మర్యాద..గౌరవం
అమ్మ, అక్కలు పిలిచిన పేరు నాది..
అమ్మ అయ్యల ప్రేమకు రూపు అది
ఇంటి పేరు మారితే..
అసలు పేరు సంతకెళ్తుందా..
ఏమండీ అని పిలిస్తే..
నీ గౌరవం కోటెక్కుతుందా..
పరుపుకాడ లేని పెద్దరికం..
పిలుపుకేలనయ్యా..
పిలుపులో నీ దాష్టీకం..
ఇక చెల్లబోదు రయ్యా..
ఆకాశంలో సగం..
సంసారంలో కీలకం..
ఇచ్చిపుచ్చుకుంటేనే..
నీకైనా.. నాకైనా గౌరవం
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు
నా పేరు మరిచావ్
ఏరా అంటే.. అమర్యాదంటావ్
పేరుతో పిలిస్తే..అసంప్రదాయ మంటావ్
నాకు లేదా మర్యాద..గౌరవం
అమ్మ, అక్కలు పిలిచిన పేరు నాది..
అమ్మ అయ్యల ప్రేమకు రూపు అది
ఇంటి పేరు మారితే..
అసలు పేరు సంతకెళ్తుందా..
ఏమండీ అని పిలిస్తే..
నీ గౌరవం కోటెక్కుతుందా..
పరుపుకాడ లేని పెద్దరికం..
పిలుపుకేలనయ్యా..
పిలుపులో నీ దాష్టీకం..
ఇక చెల్లబోదు రయ్యా..
ఆకాశంలో సగం..
సంసారంలో కీలకం..
ఇచ్చిపుచ్చుకుంటేనే..
నీకైనా.. నాకైనా గౌరవం
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment