Sunday, 13 September 2015

నీ నవ్వు ఎంత ప్రమాదం..

అమ్మో..
నీ నవ్వు ఎంత ప్రమాదం..
నా గుండెను నీ రూపంతో
నింపేసింది..
నీ చూపు కోసం..
ఏడాది పాటు వేచి చూసేలా చేసింది..
నీ ముందు నా ప్రేమను పరిచి..
కాలేజీ నుంచి డిబార్ అయ్యేలా చేసింది
నీ అన్న చేతిలో దెబ్బలు తిని..
ఆసుపత్రు పాలు చేసింది
చివరికి
అదే నా చేత నీతో..
ఏడు అడుగులు నడిపించింది..
మరో సారి అలా నవ్వకు ప్లీజ్..
మరో మారు నీ కోసం అన్ని పాట్లు పడలేను

--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment