Sunday, 13 September 2015

నా దండు

ప్రపంచమంతా.. ఒక్కటై..
దండెత్తి వచ్చినా..
లేదు మాకు పోటీ
నా దండుకు సాటి.. --నాగ్

నా జర్నలిస్టు సర్వీసులో నేను తీసిన.. నాకు బాగా నచ్చిన ఫోటో ఇది..
పిఠాపురం మండలం విరవాడ లో ఇటుక బట్టీలు ఎక్కువ వుంటాయి..
వాటిలో పనిచేయడానికి తెలంగాణ, ఒరిస్సా, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి
కూలీలు వస్తుంటారు.. వారితో పాటూ వారి పిల్లలూ వస్తారు..
కొన్ని నెలల పాటు పనిచేసి వెళ్లిపోయే కూలీల పిల్లలకు ఇక్కడ చదువు వుండదు.
వారు బడికి కూడా పోరు.. అలా మట్టిలో.. చేలలో.. కాలువ గట్ల పైన తిరుగుతూ కాలం
గడిపేస్తారు.. తాత్కాలికంగా వారిని బడిలో చేర్చడానికి ప్రయత్నించినా వారు చేరరు..
భాష ఇబ్బంది కూడా వుంది..
ఈ స్టోరీ చేయడానికి వెళ్లినప్పుడు తీసిన ఫోటో ఇది..
నేను ఫోటో తీస్తున్నప్పుడు ఎవరో చెప్పినట్టు ఆ గడుగ్గాయిలు ఒక్కొక్కడూ ఒక్కో ఫోజు పెట్టారు చూడండి..
కొమ్ములు తిరిగిన దర్శకుడు కూడా వారిని అలా నిలబెట్టలేడేమో..
బాలల సహజ సౌందర్యం.. హావ భావాలు పరిశీలించండి..
నాకైతే బాగా నచ్చింది.. మీకూ నచ్చుతాది అనుకుంటున్నాను
నోట్: ఈ ఫోటో సుమారు ఐదేళ్ల క్రితం తీసింది. తవ్వకాల్లో ఇప్పుడు బయట పడింది

--నాగ్

No comments:

Post a Comment