గణగణ గంటల ఎద్దుల బళ్లు..
గలగల పారే పంట కాలువలు..
చకచక సాగే పల్లె పడుచులు..
గుబగుబ పొంగే పాడి పంటలు..
నా పల్లెటూళ్లు..
నా కలల లోగిళ్లు..
కొబ్బరాకు మాటున సూరీడు..
పనస చెట్టు వెనుక శశికాంతుడు..
మల్లెతోట మీదుగా పవనుడు..
ఏడాది పొడవునా కొలువుండే వసంతుడు..
ఏనాడు వదిలి వుండలేరు..
పచ్చని కొబ్బరాకు చీర కట్టి గోదారమ్మ..
నీలాకాశంలో పాలపుంతల్లా..
వేగంగా సాగే గూడు పడవలు..
వెన్నెల వేళ మెరిసే ఇసుక తిన్నెలు..
సన్నని గొంతులో పడుచు రాగం..
కాలువ గట్టు చెట్టు మీద కోయిల గానం..
మా కోనసీమ ఇలలో స్వర్గం..
(ఫోటో.. బోడసకుర్రు బ్రిడ్జి సమీపంలో తీసిన ఫోటో ఇది)
--నాగ్
గలగల పారే పంట కాలువలు..
చకచక సాగే పల్లె పడుచులు..
గుబగుబ పొంగే పాడి పంటలు..
నా పల్లెటూళ్లు..
నా కలల లోగిళ్లు..
కొబ్బరాకు మాటున సూరీడు..
పనస చెట్టు వెనుక శశికాంతుడు..
మల్లెతోట మీదుగా పవనుడు..
ఏడాది పొడవునా కొలువుండే వసంతుడు..
ఏనాడు వదిలి వుండలేరు..
పచ్చని కొబ్బరాకు చీర కట్టి గోదారమ్మ..
నీలాకాశంలో పాలపుంతల్లా..
వేగంగా సాగే గూడు పడవలు..
వెన్నెల వేళ మెరిసే ఇసుక తిన్నెలు..
సన్నని గొంతులో పడుచు రాగం..
కాలువ గట్టు చెట్టు మీద కోయిల గానం..
మా కోనసీమ ఇలలో స్వర్గం..
(ఫోటో.. బోడసకుర్రు బ్రిడ్జి సమీపంలో తీసిన ఫోటో ఇది)
--నాగ్
No comments:
Post a Comment