Monday, 14 September 2015

ఎవరన్నారు.. ప్రశ్నించమని

ఎవరన్నారు.. ప్రశ్నించమని
ఎవరు చెప్పారయ్యా నీకు..
అన్యాయాన్ని నిలదీయమని
మీ ఎరుపు రాతలు ఇక్కడ..
కడుపులు నింపడం లేదు.
మీ రాజ్యాంగ నీతులు ఇక్కడ..
కన్నీరు తుడవడం లేదు..

కన్నెర్ర చేస్తే..
పిండేది పేదోడి గుండెలు..
ఎదురు తిరిగితే
బతుకు బండికి బ్రేకులు

చాలు చాలు..
మాకొద్దీ తిరుగుబాటు..
మా కడుపులు గంజికి
అలవాటు పడ్డాయ్
మా కళ్లలో నీళ్లు
ఇంకిపోయాయి..
మారక్తం మరిగి మరిగి
నీరైంది..

ఇది ప్రజాస్వామ్యం..
ప్రజలు ఇష్టపడి..
నెత్తినెక్కించుకున్న
నేతల స్వామ్యం..

తెంచుకునేందుకు..
ఇవి సంకెళ్లు కాదు..
మా తాత తండ్రుల
బానిస వారసత్వాలు..
అందుకే సాగిస్తాం..
అసమర్థుని జీవన యానం..
మా సహనం చచ్చే వరకూ..
మరో ప్రపంచం పిలిచే వరకూ..

--నాగ్

No comments:

Post a Comment