Monday, 14 September 2015

లేత కిరణాలు.

భాల భానుని లేత కిరణాలు..
పుడమిని తాకాయి..
గరిక చివరల మంచు బిధువులు
ముత్యాల్లా.. మెరుస్తున్నాయ్
పైరు పై నుంచి మలయమారుతం..
చెట్టుపై గువ్వల జంట.. రెక్కలు విప్పార్చి..
గగన పయనానికి సిద్దమవుతోంది..
తువ్వాయి.. పాల కోసం తల్లిని చేరింది..
గుడి గంట మోగింది..
బడి కీ సమయమవుతోంది..
ఇంటి ముందు రంగవల్లులపై..
సూర్య కిరణాలు శుభసూచకంగా..
తులసి కోట దగ్గర హారతి..


--నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment