Sunday, 13 September 2015

నిప్పులపై వేగుతున్నా.. బాల్యాన్ని..

సాయం సమయం..
వీచే చలిగాలి పవనం..
వెచ్చదనం కోరుకునే శరీరం..
ఆ సమయంలో ఎదురుగా..
కణకణ మండుతూ..
ఎర్రని నిప్పులు..
ఆ నిప్పులపై కమ్మని సువాసనతో
దారానికి గుచ్చిన ఎర్రని గులాబిలా..
పుల్లకు గుచ్చిన మాంసం తునక
కాలుతూ.. నోరూరిస్తూ..
అలవోకగా.. నైపుణ్యంగా..

వెదురుపుల్ల తిప్పే చేయి చూశా..
నిండా పదహారు రాని బాలుడు..
గమనించా
ఎర్రని

నిప్పులపై వేగుతున్నా..
బాల్యాన్ని..
చలివేళ సైతం నుదిటిపై చమట..
ఆడి పాడే వయసున ఎంత కష్టం..
పుస్తకాల పని పట్టే వెళలో
మధ్యం దుకాణం ముందు పడిగాపులు..
తమ్ముడూ..
నీ తోటి వాళ్లలా ఎందుకు లేవు..
ఏమైంది.. ఈ దేశానికి..
అసమానతలు ఇంతేనా..
ఎక్కడ తగలేశారు చట్టాలని..
మత్తులో మునిగే నేతలూ..
ఎప్పుడు కళ్లు తెరిచేది..?

--నాగ్

(పిఠాపురంలో ఒక మధ్యం దుకాణం దగ్గర ఈ దృశ్యం చూశాను..
మొదట నిప్పులపై కాలుతున్న చీకులు చూశాను.. నోరూరింది..
అయితే అది కాల్చే కుర్రాడిని చూస్తే బాధనిపించింది.. తన తోటి వాళ్లు
మోటారు సైకిళ్లపై విలాసంగా వచ్చి అతని దగ్గరే చీకులు కొంటున్నారు..
ఏమైంది ఈ దేశానికి..)

No comments:

Post a Comment