Sunday, 13 September 2015

కడలిని చూస్తే..

కడలిని చూస్తే..
నా అమ్మ చందం..
నేను కనిపించగానే..
కెరటాల చేతులు చాపి ఆహ్వానిస్తుంది..
కడుపులో వేదనల బడబాగ్ని వున్నా..
పైకి చిరునవ్వు నురగలే కక్కుతుంది..
ఆటొస్తే.. కుంగిపోయి..
పోటొస్తే.. పొంగిపోయే.. పిచ్చి తల్లి
రెక్కలొచ్చి సాగే పక్షుల బారును చూసి..
వాటిని అందుకోవాలని.. తనలో దాచుకోవాలని
ఎంత తాపత్రయం..
తన గుండెను చీల్చుతూ సాగే..
ఓడలంటే ఎంత జాగ్రత్త..
చెరువులో చేపను పట్టి.. తన
పిల్లల నోటికందించే కొంగతల్లిలా..
తన గర్బంలో దాచిన చేపలని..
వలల జల్లెడలో పట్టి.. అందిస్తుంది..
ఆప్యాయంగా ఒడ్డు చేరాలనే ప్రయత్నంలో
భంగపడినా.. అలకన్నదే వుండదు..
అచ్చం.. అమ్మలానే..
కణకణ మండే భానుడి సైతం..
కడలి ఒడిలో ఒదిగిపోతాడందుకే..

--నాగ్

No comments:

Post a Comment