నా జ్ఞాపకాలను పదిల పరుస్తూ..
కష్టాలు, సంతోషాలను ఇన్నాళ్లూ మోసుకొచ్చిన
పోస్టు మ్యానుకు లేఖ రాయాలనుంది..
ఇంటర్నెట్.. సెల్ ఫోను మెస్సేజుల మోజులో
తపాలా పెట్టెను నిర్లక్ష్యం చేసినందుకు..
క్షమాపణ చెప్పాలనుంది..
అత్తారింట్లో అక్క క్షేమం కోసం..
అబ్రాడ్ లో అన్న వివరం..
పొరుగూరిలో బాబాయ్ సంతోషం..
అక్షరాలు పొదిగిన లేఖ రూపంలో..
మోసుకొచ్చిన నీతో మనసు విప్పి చెప్పాలని వుంది..
ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగం..
నియామక పత్రం చివరి క్షణంలో చమటోడుస్తూ..
తెచ్చింది నువ్వేనని.. కృతజ్ణత చూపాలని వుంది..
ప్రేమ నైరాశ్యంలో మునిగిన వేళ..
మా మధ్య మధ్యవర్తి వార్తాహరునికి..
ప్రేమతో ధన్యవాదాలు చెప్పాలని వుంది..
ఉత్తరం రాశాను కానీ..
ఎలా పోస్టు చేయాలి..?
తుప్పు పట్టిన తపాలా పెట్టేలో..
ఈ లేఖ ఎలా వేయాలి..?
నిన్న..
నా భవిష్యత్ కు అదే.. మ్యాజిక్ బాక్సు కదా..
--నాగ్
No comments:
Post a Comment