
రావు రాజ్య పతాక వెల్ల గొడుగు ధగ ధగలు..
ఎంత కఠినాత్మురాలవు..
కవి పండిత శోభితమైన.. రావు దర్బారును..
రాళ్ల పాలుచేశావు కదా..
ఏవీ.. నాటి కోటగుమ్మంపై కోరలు చాచి..
గర్జిచిన.. మృగాల జంట..
ఏ మానవ మృగాల పాల్పడ్డాయో కదా..
ఎక్కడా కండలి తిరిగిన పహిల్వానుల..
ప్రతిమల జంట..
పాత సామాగ్రి కొట్టు చేరలేదు కదా..
కాన రావేమి గజ తురగ పదాతి సేనలు..
నడయాడిన తావులు..
కందకాలు నిండి ఫ్లాట్లు అయ్యాయా..?
కనిపించవేమి.. భళ్లాలు.. బరిశలు.. తుపాకులు..
ఏదీ జయస్థంభం..
మచ్చుకైనా వినిపించడం లేదేమిటి..
రావు కులజుల కీర్తి కైవారాలు..
.. నిజమే ఇది కాలం చేసిన దుర్మార్గం కాదు..
మనసు లేని.. మనుష్యుల కాని పనే..
చరిత్రను తుడిచేసే ప్రయత్నమే..
రావుల కోటలో ఆరావులు మొలిపించినది..
చరిత్ర హీనుల దాష్టీకమే..
--నాగ్
(ఇది పిఠాపురం కోట.. ధు:ఖ భావిలమైన పీఠపుర రాజ కోట)
No comments:
Post a Comment