Monday, 14 September 2015

మరమరాళ్లా.. నా జ్ఞాపకాలు..

గుప్పెటతో పోసిన
మరమరాళ్లా..
నా జ్ఞాపకాలు..
చెల్లా చెదురయ్యాయి..
ఒక్కొక్కటీ ఏరుకుంటున్నా..
చేజారిన నా స్మృతులని..
నిస్పృహతో వచ్చే కన్నీళ్లకు..
కొన్ని తడుస్తున్నాయ్
నా చేతికి అందక ఎగిరిపోతున్నాయ్
వాటిని అందుకోవడంలో నేను..

--నాగ్

No comments:

Post a Comment