నేను నడిచి వెళ్లే దారిలో..
పూలు పరువకపోయినా పరవాలేదు..
నీ నగుమోము కనిపించిన చాలు
నే గెలిచిన సమయంలో..
గజమాలలు అక్కర్లేదు..
నీ అభినందన స్పర్శ చాలు
నే అందలమెక్కిన నాడు..
మేళతాలాలు అవసరం లేదు..
నీ చిరునవ్వు చాలు
నే అలసి సొలసిన వేళ..
నీ కొనగోటితో నా చమట తుడిచిన చాలు
నే ఓటమి చెంది భీతిల్లిన చోట
నా వెన్నుతట్టి నిలిచిన చాలు
నిను ఎడబాసి వేదన చెందిన వేళ..
జ్ఞాపకమై నా ఎదలో కొలువుండిన చాలు
నిను చేరే యత్నంలో..
నాకు నేనే కాని నాడు..
వెచ్చని కన్నీటి బొట్టు వదిలిన చాలు..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
పూలు పరువకపోయినా పరవాలేదు..
నీ నగుమోము కనిపించిన చాలు
నే గెలిచిన సమయంలో..
గజమాలలు అక్కర్లేదు..
నీ అభినందన స్పర్శ చాలు
నే అందలమెక్కిన నాడు..
మేళతాలాలు అవసరం లేదు..
నీ చిరునవ్వు చాలు
నే అలసి సొలసిన వేళ..
నీ కొనగోటితో నా చమట తుడిచిన చాలు
నే ఓటమి చెంది భీతిల్లిన చోట
నా వెన్నుతట్టి నిలిచిన చాలు
నిను ఎడబాసి వేదన చెందిన వేళ..
జ్ఞాపకమై నా ఎదలో కొలువుండిన చాలు
నిను చేరే యత్నంలో..
నాకు నేనే కాని నాడు..
వెచ్చని కన్నీటి బొట్టు వదిలిన చాలు..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment