Monday, 14 September 2015

కథలు చెప్పేవారేరీ..

అనగనగా ఒక రాజు..
ఇలా
కథలు చెప్పేవారేరీ..
చెప్పినా వినేవారేరీ..
కథ కంచికి ఎప్పుడో వెళ్లిపోయింది..
మనసంస్కృతి గుమ్మం దాటేసింది..
కథలు చెప్పేవారు కొదవయ్యారు

ఇంటర్నెట్ రాహువుకు
కథల 'చందమామ' బలైంది
'బుజ్జాయి' చదివే పాపలు లేరు
'బుడుగు' మాటలు బుడ్డోల్లకు చెవికెక్కవు
'బాలజ్యోతి' ఆరిపోయింది..
ఫేసుబుక్కు మిత్రుల ముందు..
'బాలమిత్ర' గల్లంతు..

వీడియో గేమ్స్ లొచ్చి..
గ్రామీణ ఆటలను అవుట్ చేశాయి..
దొంగా పోలేసు ఆటలో..
కంప్యూటర్ ఆటలే పోలీసయ్యాయి

సెల్ ఫోను చాటింగ్ లతో..
అమ్మమ్మ కబుర్లకు పనిలేదు..
చందమామ రావే అనేలోగానే..
స్క్రీన్ సేవర్ మీద వెన్నెల కురిపించేస్తున్నారు

నీతికి నిలువ నీడ లేదు..
నైతిక విలువలకు తిలోదకాలే
మంచి చెప్పేవారు లేరు.. వినేవారూ కరవు
అప్యాయతకు.. విజ్ఞానం కలబోసి
వినోదంగా అందించే...
తాతయ్య.. అమ్మమ్మ కబుర్లు..
ఏవీ ఎక్కడా.. టీవీ సీరియళ్ల గోలలో..
వినిపించవే.. కనిపించవే..

--నాగ్

No comments:

Post a Comment