ఒక ఊరిలో ధర్మయ్య అనే ధనవంతుడు వుండేవాడి.
పేరుకు తగినట్టే.. ధర్మయ్య పుణ్యకార్యక్రమాలు చేసేవాడు.
ఒకరోజు హఠాత్తుగా అతను చనిపోయాడు..
దేవదూతలు వచ్చి అతనిని తీసుకుపోయారు. ధర్మయ్య ఆశ్చర్య పోయాడు..
ఇన్ని దాన ధర్మాలు చేసిన తాను ఇంత త్వరగా చనిపోవడం ఏమిటి...?
అదే దేవుడిని ప్రశ్నించాడు.. '' దేవా నా భార్య, పిల్లలు నా కోసం ఏడుస్తున్నారు.. వారికి నా పట్ల అమిత ప్రేమ, నా సేవకులకు నేను లేనిదే వారి బాగోగులు చూసే వారు లేరు.. దయచేసి నన్ను మరో మారు బతికించండి'' అని వేడుకున్నాడు..
దేవుడు నవ్వాడు.. పిచ్చి ధర్మయ్య.. అంతా మాయ నువ్వు బతికి వున్నంత వారకే వారికి నీ మీద ప్రేమ. వారిని మరిచిపోయి ఇక్కడ సుఖంగా వుండు అని చెప్పాడు..
ధర్మయ్య ఒప్పుకోలేదు.. తన పట్టు వదల లేదు..
చివరికి విసిగిపోయిన దేవుడు.. ఒక షరతు మీద అయితే ధర్మయ్యను బతికిస్తానన్నాడు..
ధర్మయ్య భార్యగాని, కొడుకులు బంధువు, సేవకులు ఎవరైనా సరే.. అతని కోసం సమాధి దగ్గరికి వస్తే.. తిరిగి బతికిస్తానని మాట ఇచ్చాడు..
అప్పటి నుంచీ ధర్మయ్య సమాధిలో తన వారి కోసం ఎదురు చూస్తున్నాడు..
నెలలు గడిచినా ఎవరూ రాలేదు..
ఒకరోజు హఠాత్తుగా ధర్మయ్య సమాధిని ఎవరో తొలుస్తున్నాట్టు శబ్దం అయ్యింది..
ధర్మయ్య ఆత్మ ఆనందానికి గురైంది.. తాను తిరిగి బతుకుతాననే.. ఆతృత ఆపుకోలేక ఎవరదీ..? అని బిగ్గరగా ప్రశ్నించాడు
''అయ్యా.. నేను మీ ఇంటి కుక్కని'' అని సమాధానం వచ్చింది
అదేమిటి నువ్వొచ్చావ్.. నా భార్య ఏమైంది.. అడిగాడు ధర్మయ్య
నీ భార్యకు నిన్ను తలుచుకునే తీరిక ఎక్కడిది స్వామి, నీ కొడుకులు, కోడళ్లు,ప్
అయితే నా కొడుకులైనా నన్ను తలుచుకుంటున్నారా..?
మహానుభావా.. నీ కొడుకులకు నువ్వెక్కడ గుర్తుంటావ్.. 11వ రోజు దినంతోనే వాళ్లు నీకు నీళ్లొదిలేశారు.. నువ్వు సంపాదించిన వ్యాపారాలను పెంచి పెద్దవి చేయడంలో తలమునకులుగా వున్నారు.
మరి నా సేవకులు, బంధువులకు కూడా నేను గుర్తులేనా.. ధర్మయ్య ఆత్మ ఘోషించింది..
''ఎవరి జీవితాలు వాళ్లవి.. నీ కొడుకులు పెట్టే ఇబ్బందులను తట్టుకుని ఎప్పుడు కొలువు ఊడుతుందా అనే ఆందోళనలో వాళ్లకి నువ్వెక్కడ గుర్తొస్తావ్''
సరే ఇంతకీ నువ్వెవరు.. నా సమాధిని కదుపుతున్నావ్.. నీరసంగా ప్రశ్నించింది ధర్మయ్య ఆత్మ..
నేనా.. నీ ఇంట్లో నువ్వు వేసే ఎంగిలి మెతుకులు తింటూ పడి వున్న కుక్కను స్వామి చెప్పింది కుక్క..
ఆ సమాధానానికి ధర్మయ్య ఆత్మ ఆనందంతో గంతులు వేసింది..
పోనీలే కనీసం నువ్వైనా నా కోసం వచ్చావ్.. నన్ను బతికించడానికి కృతజ్ఞతగా చెప్పింది ధర్మయ్య ఆత్మ..
భలే వుంది.. నేను నీ ఇంట్లోనే కాదు చాలా ఇళ్లలో ఎంగిలి మెతుకులు తిన్నా.. ఎంత మంది కోసమని వెళ్లమంటావ్..
నీ సమాధి ఇరుకున ఒక బొమిక పడిపోతే వెదుకుతున్నా.. అంతే..
అంటూ ఆ కుక్క బొమిక నోట కరుచుకుని తుర్రు మంది..
ఆ సమాధానంతో ధర్మయ్య ఆత్మ మరో మారు చచ్చింది..
( ఈ
కథ నేను సుమారు 20 సంవత్సరాలకు ముందే చందమామ లో చదివిన గుర్తు.. రచయిత గుర్తు పేరు గుర్తు లేదు నేటి సమాజ తీరుకు ఇది అద్దం పట్టేలా వుందని పించి ఇక్కడ పోస్టు చేశా..)
---నాగ్

No comments:
Post a Comment