ఈ రోజు చంద్రగ్రహణం..
సాదారణంగా గ్రహణ సమయంలో దేశంలోని ఆలయాలు అన్నీ మూసేస్తారు. సూర్యగ్రహణం అయినా.. చంద్రగ్రహణం అయినా గ్రహణ సమయంలో దేశంలోని అన్ని ఆలయాలూ మూసి వేస్తారు. తిరుపతి, కాశీ వంటి క్షేత్రాల్లో సైతం దర్శనాలు, అభిషేకాలు, పూజాధికాలను నిలిపేస్తారు
అది ఆచారం.. మళ్లీ గ్రహణం విడిచాక సంప్రోక్షణ చేసి స్వామి వారికి అభిషేకాలు చేస్తారు.
అయితే దేశంలో కాళహస్తి ఆలయం గ్రహణం సమయంలో మూయరు. అక్కడ రాహుకేతువు పూజలు వున్నందున ప్రత్యేక అభిషేకాలు పూజలు కొనసాగుతాయి.
అలాగే మా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాదగయా క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయం సైతం గ్రహణం సమయంలో మూయరు.. ఆ సమయంలో ఇక్కడా మామూలుగానే దర్శనాలు, పూజలు కొనసాగుతాయి.
దీనికి ప్రత్యేక కారణం తెలియడం లేదు. అనాధిగా ఇది ఆచారం అనే చెబుతున్నారు.
ఏమైనా మన కుక్కుటేశునికి గల ప్రత్యేకతల్లో ఇదొకటి..
గ్రహణం విడిచాక సంప్రోక్షణ చేస్తారు.
గ్రహణంలోనూ తెరిచి వుండే రెండే క్షేత్రాలు ఒకటి కాళహస్తి అయితే, రెండోది పాదగయా క్షేత్రం.
ధన్యవాదాలు..
--నాగ్
No comments:
Post a Comment