
నేను రోజూ ఆదారినే వెళ్తా..
ఆ చెట్టు కింద ఆమె..
చింకి చాపపై.. చిరిగిన కంబళీ కప్పుకుని..
అటుగా వెళ్తున్న నన్ను చూసేది..
భావం లేని.. జీవం లేని గాజు కళ్లతో..
ఒకరోజు బోరున వాన..
ఆమె కదల లేదు.. తడుస్తూ అక్కడే..
మరో రోజు ఫెళ్లున ఎండ..
కదల లేదు.. ఎండుతూ అక్కడే..
శిశిరంలో చెట్టు ఆకులు ఆమెపై జాలిపడినట్టు..
రాలి పడేవి..
వసంతంలో పూల కుప్ప పేరుకునేది..
ఆమె మీద..
నేను అదే దారిన వెళ్తున్న..
అదే చూపు..
జీవం లేని గాజు కళ్ల చూపు
ఒక రోజు ఆమె లేదు.. కంబళీ.. చాప
ఆమె జాగా.. ఖాళీగా..
ఆ చూపు లేదు..
మరో రోజు.. మరొకామె.. చెట్టు కింద
అదే చాప, అదే కంబళీ
అదే చూపు గాజుకళ్ల చూపు
నేను వెళ్తున్నా..
అవును నా లాంటి కొడుకులు వున్నంత కాలం
అమ్మ అలా చెట్టు నీడనే..
కన్నీరింకిన.. గాజు కళ్లతో..
--నాగ్
ఫోటో : గూగుల్ నుంచి తీసుకున్నది.. ఒరిజినల్ ఓనర్ నాకు తెలీదు వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment