Sunday, 13 September 2015

నిను తలచిన ప్రతి క్షణం..

నిను తలచిన ప్రతి క్షణం..
ఇదే జరుగుతోంది..
నా హృదయం నాకు ఎదురు తిరుగుతోంది..
నిను మరువాలని తలచిన ప్రతిక్షణం..
నువ్వు గుర్తొస్తుంటే..
కనుపాప చెలియకట్టను దాటి కన్నీరు
వరద గోదారే అవుతోంది..

నాకు ఇప్పుడే తెలిసింది..
వంద జన్మలకు సరిపోయే వేదన
నీ ఏడబాటు మిగల్చగలదని

నా మనసు నను ప్రశ్నిస్తోంది..
ఎందుకు కలిశావు..
ఎందుకు విడిపోయావు అని..
ఏం చెప్పను..
నాకే తెలియని సమాధానం ఎలా చెప్పను.
సమాధానం తెలిసిన నువ్వు
మౌనం దాల్చితే.. ఎవరికి చెప్పుకోను
మన మనసుకు మనమే ప్రశ్నగా మిగిలితే..
ఆ నరకం ఏమని చెప్పను..

--నాగ్
ఫోటో : గూగుల్ నుంచి తీసుకున్నది.. ఒరిజినల్ ఓనర్ నాకు తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment