ఆకాశంలో ఒలికిన ముగ్గులా..
తెల్లని మబ్బులు..
నీలం కాన్వాసు మీద
ఏవో విచిత్ర ఆకారాలు
ఏనుగు.. చేప.. గుడి
నేలమీద రూపాలు అన్నీ..
నింగి మీద..
విచిత్రంగా..
మనసులో భావాలకు..
అనుగుణంగా..
నువ్వు గుర్తించావా..
ఆకాశంలో నీ రూపం
హాయిగా నవ్వుతూ..
చల్లగాలిని అడిగాను..
నీ రూపం చెదరగొట్టోద్దని
మెరుపుని కోరా..
మెరిసి నీరవ్వొద్దని..
అయినా అవి నా మట వింటాయా..
ఇన్నేళ్లు ప్రేమించినా..
నువ్వే నన్ను కాదన్నావు
మేఘం కరిగి.. దారగా వర్షం..
నా కన్నీటిని మింగేస్తూ..
--నాగ్
తెల్లని మబ్బులు..
నీలం కాన్వాసు మీద
ఏవో విచిత్ర ఆకారాలు
ఏనుగు.. చేప.. గుడి
నేలమీద రూపాలు అన్నీ..
నింగి మీద..
విచిత్రంగా..
మనసులో భావాలకు..
అనుగుణంగా..
నువ్వు గుర్తించావా..
ఆకాశంలో నీ రూపం
హాయిగా నవ్వుతూ..
చల్లగాలిని అడిగాను..
నీ రూపం చెదరగొట్టోద్దని
మెరుపుని కోరా..
మెరిసి నీరవ్వొద్దని..
అయినా అవి నా మట వింటాయా..
ఇన్నేళ్లు ప్రేమించినా..
నువ్వే నన్ను కాదన్నావు
మేఘం కరిగి.. దారగా వర్షం..
నా కన్నీటిని మింగేస్తూ..
--నాగ్
No comments:
Post a Comment