Sunday, 13 September 2015

పోయేదేముంది.

రాతిమీద గులాబీలు పూయవు
ఎడారిలో సెలయేటి గలగలలు వినిపించవు..
గ్రీష్మంలో కోయిలగానం ఊహించలేము
పగటికల నిజమవుతుందని అనుకోలేం..
మూర్ఖుడి నుంచి మంచి మాటలు కోరుకోలేం..
కానీ..
మనసున్న ప్రతి మనిషి నుంచీ ప్రేమను ఆశించవచ్చు..
ఆ దిశగా ప్రయత్నించండి..
పోయేదేముంది.. ప్రయత్నమే కదా..


--నాగ్
ఫోటో : గూగుల్ నుంచి తీసుకున్నది.. ఒరిజినల్ ఓనర్ నాకు తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment