Monday, 14 September 2015

లేపాక్షి

 

ఈ ఫోటో సుమారు 15 సంవత్సరాల క్రితం(2015 నాటికి)
లేపాక్షిలో సాదారణ కెమెరాతో తీసింది..
(అప్పటికి డిజిల్ కెమెరాలు చాలా తక్కువ)
ఈసప్త శిరశ్శుల నాగ విగ్రహానికి ఒక కధ చెబుతారు..
ఈ విగ్రహాన్ని శిల్పులు కేవలం కొన్ని గంటల్లోనే చెక్కేశారట..
లేపాక్షి ఆలయాన్ని చెక్కుతున్న శిల్పులకు ఆహారం వండి పెట్టడానికి
వారి తల్లి కూడా వచ్చిందట..
ఒకరోజు ఆలయం చెక్కే పని నుంచి కొడుకులు భోజనానికి వచ్చారు..
ఆ సమయానికి తల్లి ఇంకా అన్నం వండలేదు.
వెంటనే ఆమె.. కాసేపు అలా విశ్రమించండి నాయనలారా అన్నం వార్చేసి వడ్డిస్తాను అని
చెప్పింది..
అయితే ఆమె కుమారులు తల్లి అన్నం వండే వరకూ ఖాలీగా కూర్చోలేక అక్కడ వున్న
శిలని చెక్కడం ఆరంభించారట..
తల్లి అన్నం వండే సమయానికి ఆ శిలను సప్తశిరస్సుల నాగేంద్రునిగా చెక్కేశారు..
తల్లి ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయిందట.. దాని ఫలితంగానే శిలకు ఒక వైపు పెద్ద పగులు వుంటుంది..
అందుకే అంటారు నరుని చూపుకి నల్ల శిలైనా పగులుతుంది అని..
అన్నట్టు ఇదే శిల్పానికి సమీపంలోనే
శిల్పులు ఆహారం తీసుకునే శిలా పాత్రలు(కంచాలు) సైతం వుంటాయి..
హింధూఫురం వెళ్లినప్పుడు అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని లేపాక్షిని దర్శించే భాగ్యం కలిగింది.. చాలా చక్కని ఆలయం.. కాదు కాదు అద్బుతమైన ఆలయం..
తప్పకుండా చూసి తీరాలి.. మన వారి కళా నైపుణ్యానికి జోహార్లు అర్పించాలి..
మరో మారు నాగుల చవితి శుభాకాంక్షలు

---నాగ్

No comments:

Post a Comment