Monday, 14 September 2015

పెరుమాళ్లపురం పాకం గారెలు

తూర్పుగోదావరి జిల్లాలో.. రుచులకు కొదవ లేదు..
ఏ మూలకు వెళ్లినా ఎదో ఒక కొత్త రుచి పలకరిస్తుంది..
జివ్హను రంజింప చేస్తుంది.
తుపాను వార్త కవరేజీలో భాగంగా ఉప్పాడ కొత్తపల్లి మండలం రమణక్కపేటకు వెళ్లా..
అయితే అప్పటికి అలల తాకిడి పెద్దగా లేదు..
విషయ సేకరణ తర్వాత
మిత్రుడు కొత్త రాంబాబు తొండంగి మండలం పెరుమాళ్లపురం వెళ్లి పాకం గారెలు తిందామన్నాడు.. గారెలు అనగానే నాకూ నోరూరింది.
పెరుమాళ్లపురం మేము వున్న గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరమే..
వెంటనే సై అంటే సై అని మిత్రులు అందరం బయలు దేరాం..
ఒక చిన్న పాకలో ఈ గారెలు చేస్తున్నారు ఇద్దరు మహిళలు..
మేము వెళ్లే సరికే వివిధ వాహనాల మీద తుని, కాకినాడ తదితర్ పట్టణాల నుంచి వచ్చిన గారెల ప్రియులు వేచి వున్నారు..
కట్టెల పొయ్యి మీద సలసల కాగుతున్న నూలెలో చిన్ని చిన్ని
గారెలు వేగుతున్నాయి..
ఎర్రగా వేగిన గారెలను పక్కనే వున్న పాకంలో వేస్తోంది ఆమె..
ఇలా వాయి తియ్యాగానే అలా అయిపోతున్నాయి..
మొత్తానికి నా మిత్రుడు సత్య తన పలుకుబడి ఉపయోగించి మాకు గారెలు తెచ్చాడు..
ఏమాటకామాటే..చెప్పుకోవాలి
ఇలా నోట్లో పెట్టు కోగానే అలా కరిగిపోతున్నాయి గారెలు..
నిమిషంలో రెండు ప్లేట్లు(అంటే ఎనిమిది) గారెలు లాగించేశాను..
అంత బాగా చేసిన ఆమెకు ధాంక్స్ చెప్పి వచ్చేశాము..
ఈ గారెలను ఫంక్షన్లకి కూడా సప్లయ్ చేస్తారట..

ధన్యవాదాలు
--నాగ్

No comments:

Post a Comment