Sunday, 13 September 2015

వేదన తర్వాత ఆనందమూ వుంటుంది..

శిశిరం తర్వాత..
వసంతం వస్తుంది..
వేదన తర్వాత
ఆనందమూ వుంటుంది..
వేచి చూడాలంతే
పడిన విశాఖ పడినట్టే వుండదు
ఆకాశం ప్రభవించిన సూర్యుడిలా..
ఎదుగుతుంది..
పూలు రాలినా..
మొక్క బతికే వుంది..
గూడు చెదిరినా..
గుండె కొట్టుకొంటోంది..

నవ్వినా.. నాపచేను పండుతుంది..
ఉక్కు నగరం.. వజ్రతుల్యమవుతుంది..
విశాఖ నగరం..
విశ్వనగరమవుతుంది..
కొంత సమయం కావాలంతే..
కొన్ని చేతులు కలవాలంతే

--నాగ్
 హుదుత్ తుపానుకు దెబ్బతిన్న విశాఖను వుద్దేసించి రాసినది
2014/ అక్టోబర్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment