
మేఘాలను దారిలో పరుస్తా..
చిరునవ్వుల వరమిస్తావా..
మెరుపు వన్నే నీకు అద్దుతా
చిరుమువ్వలా పలకరిస్తావా..
చిరుగాలి చీరచుడతా
నీ కనుల వాకిట ఆశ్రయమిస్తావా..
ఇంద్రధనస్సు పరిచి కాపురముంటా
నీ మనసును నా కిస్తావా..
పండువెన్నెల జాబిలినిస్తా
ఏడడుగులు సాయమొస్తావా..
నక్షత్రాల మాల వేస్తా
నీ మనసులో చోటిస్తావా..
చేరుకోడానికి ఎన్ని జన్మలైనా ఎత్తుతా
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment