గుండె గొంతులో కొట్టాడుతోంది..
కన్నీరు ఘనీభవించి..
గుండెల్లో చేరింది..
వేదన ముద్ద కట్టి కడుపును కదిలిస్తోంది..
చేయి వణకుతోంది..
కలం మొరాయిస్తుంటే..
అక్షరాలు ఎదురు తిరుగుతున్నాయి..
ఏం రాయను.. ఎలా రాయను..
కానీ ఏదో రాయాలి..
ఏదో చెప్పాలి..
గుండె స్పందన వెగం పెరుగుతోంది..
భావాలు కలగాపులగం అవుతున్నాయి..
పరిగెత్తె పదాల కాళ్లకు బండలు కట్టినట్టు..
కదలడం లేదు..
దేని గురించి రాయను..
శోక సంద్రంలో సుందర నగరం..
చివరి కోరిక తీరని చిన్నారి హృదయం..
కన్నబిడ్డలను కడతేర్చిన మేధావి కర్కశం
విదేశీ అహంకారానికి సైనికుని బలిదానం..
ఏది రాయను..
కను రెప్పదాటని కన్నీరు నాది..
గుండెల్లో గూడు కట్టిన వేదన నాది..
దిశా నిర్థేశం లేని అక్షరాలతో
భావం పలకలేని కవిత్వం నాది..
--నాగ్
కన్నీరు ఘనీభవించి..
గుండెల్లో చేరింది..
వేదన ముద్ద కట్టి కడుపును కదిలిస్తోంది..
చేయి వణకుతోంది..
కలం మొరాయిస్తుంటే..
అక్షరాలు ఎదురు తిరుగుతున్నాయి..
ఏం రాయను.. ఎలా రాయను..
కానీ ఏదో రాయాలి..
ఏదో చెప్పాలి..
గుండె స్పందన వెగం పెరుగుతోంది..
భావాలు కలగాపులగం అవుతున్నాయి..
పరిగెత్తె పదాల కాళ్లకు బండలు కట్టినట్టు..
కదలడం లేదు..
దేని గురించి రాయను..
శోక సంద్రంలో సుందర నగరం..
చివరి కోరిక తీరని చిన్నారి హృదయం..
కన్నబిడ్డలను కడతేర్చిన మేధావి కర్కశం
విదేశీ అహంకారానికి సైనికుని బలిదానం..
ఏది రాయను..
కను రెప్పదాటని కన్నీరు నాది..
గుండెల్లో గూడు కట్టిన వేదన నాది..
దిశా నిర్థేశం లేని అక్షరాలతో
భావం పలకలేని కవిత్వం నాది..
--నాగ్
No comments:
Post a Comment