చీమలు పెట్టిన పుట్టలో..
చీమలుకాపురముండవ్
బంగారు గనుల్లో పనిచేసినా..
చేతికి మట్తి తప్పా.. కనకం అంటదు
దాని నీడ కూడా అనుభవించలేదు..
ఇది చరిత్ర చెప్పిన సత్యం..
కష్ట జీవులను వెంటాడుతున్న శాపం..
రాళ్లెత్తిన కూలీ వెనుక..
నాలుగు రాళ్లుండవ్
పండించినోడి గాదెలో..
గుప్పెడు గింజల్ మిగలవ్
తరిచి చూసినా.. ఇది నగ్న సత్యం..
పేదోడి చమటకు విలువ శూన్యం
మరో ప్రపంచం దేవుడికెరుక..
అప్పటి దాకా వీళ్లంతా ఉండేదెప్పుడు గనుక..
సర్కారు లెన్ని మారినా..
బక్కోడి తీరు మారేనా..
బరువొక్కటే..
భుజం మారుతుందంతే..
--నాగ్
No comments:
Post a Comment