అట్లతద్ది
ఉప్పు పొట్లం
``````````````
బొగ్గు రజను..
ఉప్పు పొడి..
బాగా కలిపి
ఒక గుడ్డాలో వేసి..
పొట్లంలా కడ్డతారు
దానిమీద పేడ అలిగి ఎండపెడతారు
దానిని..
మూడు భాగాలుగా చీల్చిన పచ్చి తాటి మట్ట మధ్యలో వుంచి
ఆ మట్టకి చివర తాడు కడతారు
ఈ ఉప్పు పొట్లంను అంటించి బాగా రాజేస్తారు..
తాడు పట్టుకుని గిర గిరా తిప్పితే..
బొగ్గు రజను గంధం కారణం అంటుకుని ఉప్పు చిటపట లాడుతూ..
బొగ్గు రజను నిప్పులు చెరుగుతూ వీస్తుంది..
దానిని ఎంత వేగంగా తిప్పితే అన్ని నిప్పు రవ్వలు వెలుగు రవ్వలు వస్తాయి..
దీనిని అట్లతద్దికి తిప్పడం ఆనవాయితీ..
దీపావళీ కి కూడా తిప్పుతున్నారు వెలుగుల పండుగ కథా..
అట్లతద్ది అనగానే.. ఆడువారి పండుగ.. ముఖ్యంగా ఆడపిల్లల పండుగ..
ఈ రోజు రాత్రుళ్లు నుంచే ఆటపాతలు మొదలు పెట్టేసారు.
అయితే.. ఈ పండుగలో మగవారికి కూడా ఒకింత ఆనందం వుండండోయ్..
అదే వుప్పు పొట్లం..
గ్రామాల్లో ఇప్పటికీ వుప్పు పొట్లాలు తిప్పుతుంటారు..
నిప్పు రవ్వలు వెదచల్లుతూ.. చిటపట శబ్దాలతో అగ్నివలయాలు సృష్టించే ఈ వుప్పుపొట్లం చూడటానికి ఆనందంగా వుంటుంది.. అద్బుతంగానూ కనిపిస్తుంది..
దీనిని తాటి మట్టలు, వుప్పు, పిడక పొడి, బొగ్గు రజనుతో తయారు చేస్తారు.
ముందుగా పచ్చి తాటి మట్టలను చీల్చి మూడు మట్టలను కలిపి కడతారు..
ఒక గుడ్డలో వుప్పు పొడి, పిడకల పొడి, బొగ్గు రజను, కలిపి కడతారు.. ఆ పొట్లాన్ని తాటిమట్టల మధ్య పెట్టి పొడవు తాడు మిగిలేలా కడతారు..
పొట్లంలో నిప్పు రాజేసి దానిని తాడుతో తిప్పితూ వుంటే.. నిప్పు రవ్వలు వెదచల్లుతూ విచిత్ర శబ్దంతో వలయాలు ఏర్పడతాయి అది చూడటానికి విచిత్రంగా అద్బుతంగా కనిపిస్తాయి.
కొత్త అల్లుల చేత ఈ వుప్పు పొట్లాలను తిప్పిస్తారు..
మా గ్రామాల్లో గురువారం తిప్పిన వుప్పు పొట్లం విన్యాసం ఇది..
ధన్యవాదాలు
--నాగ్

No comments:
Post a Comment