Monday, 14 September 2015

ఆకాశంలో గంధపు గిన్నెలా

ఆకాశంలో గంధపు గిన్నెలా
పున్నమి రేడు..
పాలగిన్నెపై వెన్నలా..
వెన్నెల చల్లుతూ..
గోదారమ్మను చూసి ముచ్చట పడ్డాడేమో..
నేలకు వంగి నీడ చూసుకున్నాడు..
నది వడికి రూపు చెరిగితే అలిగాడు..
నెలరాజు అలక చూసి గోదారమ్మ నవ్వింది..
వడివడి నడక నెమ్మదించింది..
ఆశ్చర్యం..
నేలపై గోదారిపై మరో చంద్రుడు..
ఏ వైపు చూడాలో తికమక పడింది..
కలువబాల..
తామెటు పోవాలో.. కలవర పడ్డాయి
నక్షత్రాలు..
శశాంకుని రాకతో..
నెమ్మదించింది.. వరద గోదారి..
అది చూసి మరింత వెలుగు కురిపించాడు
వెన్నెల రాజు

--(నాగ్)
ఫోటో:  ఈ అద్బుత దృశ్యం దేవీపట్టణం మండలం మంటూరు గోదావరిలో ఆవిష్కృతమైంది..

No comments:

Post a Comment