Monday, 14 September 2015

మోకులు


ఈ కట్టను చూడండి..
వీటిని మోకులు అంటారు.. వరి చేను కోసాక పనలు కట్టడానికి వీటిని ఉపయోగిస్తారు..
అలాగే వరి పనలను కుప్ప వేయడానికి కూడా వాడతారు..
ఇవి చాలా బలంగా వుంటాయి..
అయితే వీటిని వేటితో చేస్తారు తెలుసా..

అరటి ఆకులతో..
అవునండి.. ఆరటి చేలో విరిగి ఎండిపోయిన ఆకులను.. అలాగే అరటి తోట దిగుబడి అయ్యాక చెట్లను నరికినప్పుడు ఆకులను సేకరిస్తారు..
వాటిని ఎండబెడతారు...
ఎండిన అకుల నుంచి తడపలు మాదిరి నార తీసి పేనుతారు... అలా పేనిన తాడే మోకు అవుతుంది..
ఇవి వందా రూ.300 అట.. అంటే ఒకటీ రూ.3 అన్నమాట.
ఇప్పుడు గోదావరి జిల్లాల్లో వీటి అవసరం చాలానే వుంది..
వరికోతల సమయం కదా..
(ఈ వివరాలు దీని గురించి తెలియని మిత్రుల కోసమే చెప్పాను.. తెలిసిన వారికి అభినందనలు.. ఓస్ నాకెప్పుడో తెలుసు అనుకోవద్దు.. తెలియను వారు కూడా ఈ మారు తెలుసుకుని మరోమారు
అలా అనుకునే అవకాసం ఇద్దాం..)

ధన్యవాదాలు
--నాగ్

No comments:

Post a Comment