Saturday 16 January 2016

కోస..
పందెం బరిలో రక్తమోడుతూ వీరమరణం పొందిన కోడిపుంజు మాంసాన్నే కోస అనిపిలుస్తారు.
ఈ మాంసం చాలా రుచిగా వుండటంతో మాంస ప్రియులు ఈ మాంసం కోసం ఎగబడతారు. ఒక్కో కోస రూ.5వేలకు పై మాటే.. పైగా ఎవరూ కోసను అమ్మరు కూడా.
వాటిని నాయకులు, ఉన్నతాధికారులకు బహుమతులుగా ఇస్తారు. అచ్చంగా మన గోదావరి పులస మాదిరి.
పందెంలో వీరోచితంగా పోట్లాడి ఓడిన కోడిని అక్కడే ఈకలు దూయించేస్తారు.. కొబ్బరాకుల మంటపై కాల్చేసి కావల్సిన వారికి అమ్మేయడం లేదా బహుమతిగా ఇచ్చేయడం చేస్తారు.
ఇక కోసకు ఇంత రుచి ఎక్కడనుంచి వచ్చిందీ అంటే.. సంక్రాంతికి ఏడాది ముందు నుంచే కోడి పందెం రాయుళ్లు వాటిని బాగా పెంచుతారు. జీడిపప్పు, బాదం పప్పు. ఉల్లి ముక్కలు గంట్లు, తవుడు పెట్టి బాగా మేపుతారు. అంత తిన్న కోడిపుంజు కొవ్వు పట్టకుండా ప్రతిరోజూ ఈత పరుగు వంటి వ్యాయామాలు చేయిస్తారు. దీంతో కోడిపుంజుకు మాంసం బాగా చేరుతుంది.
సహజంగానే నాటుకోడి రుచే వేరు. అలాంటిది ప్రత్యేకంగా పెంచిన కోడి పుంజు మాంసం ఇంకా రుచిగా వుంటుంది కదా..
అందుకే దానికి అంత రేటు.
పందెంలో కోడి పుంజు గెలిచినా.. ఓడినా కోస కావల్సిందే..
సాదారణంగా గెలిచిన కోడి యజమానికి ఓడిన పుంజును ఇచ్చేస్తారు..
చాలా పందేలు ఇలా కోసల కోసమే వేస్తారు కూడా..
ఇదిగో ఇక్కడ ఫోటోలు చూడండి.. కోడిని మేపడం దగ్గర నుంచి కూరగా మారే వరకూ క్రమం ఇదే..
--నాగ్
ఫోటో లు : పిఠాపురం






లో కోడి పందేలు సమయంలో తీసినవి
(నోట్ : ఈ పోస్టు పెట్టానని కోడి పందేలను సపోర్టు చేస్తున్నట్టు కాదు.. కేవలం తెలియని మిత్రులకు  సమాచారం కోసం మాత్రమే ఈ పోస్టు)