Tuesday 12 April 2016

రామా ఫలం


రామా ఫలం ఎరుపు రంగులో నున్నగా వుండే రామా ఫలం ద్రాక్షారామ వెళ్లే దారిలో ఎక్కువగా కనిపిస్తోంది.. రోడ్డుపై పోగులు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఒక్కో పండూ రూ.15/- అయితే చిన్నవి ఇంకా ధర తగ్గుతున్నాయి..
దీన్ని నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారట.
తియ్యని వాసనతో మధురమైన రుచిని కలిగి ఉండే రామా, సీతా, అక్ష్మణా ఫలాలు నిజానికి మన దేశానివి కాదట ఐరోపా దేశాల నుంచి పోర్చుగీసు వారు 16వ శతాబ్దంలో తీసుకొచ్చారట.
వారికి మన ఐతిహాసం రామాయణం మీద వున్న అనురక్తితో ఒకే జాతికి చెందిని ఈ మూడు ఫలాలకీ స్థానికంగా వారి పేర్లు పెట్టారు.. , రామా ఫలంలో గుంజు ఎక్కువ పిక్కలు తక్కువ . మిగిలినవాటితో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయట.
అలసిన శరీరానికి చాలా త్వరగా ఉత్తేజాన్ని ఇస్తుందట.
మరో విశేషం ఏమంటే.. ఈ ఫలంలో క్యాన్సర్ కణాలను నివారించే లక్షణాలు వున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే మలేరియా ను నివారించే గుణం కూడా ఈ పండుకి ఎక్కువే. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది. పోషకాలు, పీచు, సి విటమిన్, బి - కాంప్లెక్స్ సమృద్ధిగా వుంటుందట. పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుందట. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుందని గూగుల్ సమాచారం.
ప్రస్తుతం ఇవి మన సూపర్ మార్కెట్లలో కూడా దొరికేస్తున్నాయి అనుకోండి..
నేను మాత్రం ద్రాక్షారామా రోడ్డులో కొన్నాను
--నాగ్
నోట్ : కాపీ వద్దు.. షేరే ముద్దు.

No comments:

Post a Comment