Tuesday 12 April 2016

కొత్త తాటాకులు

వసంతం వచ్చిందనడానికి
మామిడి పూత..
కోయిల కూత..
కురిసే వెన్నెల..
మలయ మారుతం..
ఇవే కాదు
వెండి రేకుల్లా.. కొత్తందాలని పరిచే తాటాకులూ గురుతులే..
అవును చైత్రమాసంలో కొత్త తాటాకులొస్తాయి..
వేసవి కదా.. కొత్త తాటాకులు చల్లదనాన్నిస్తాయి.. కొత్తందాలు సంతరిస్తాయి..
తాటాకులకీ ఓ వాసనుంది.. చక్కని.. కమ్మని సువాసన..
తాటాకులకీ శబ్దం వుంది.. తొలి వాన చినుకుల చిటపటలకు అది స్పందిస్తుంది..
రాములోరి కల్యాణానికి ఆ కొత్త ఆకులతో పందిరేసి..
ఇక అప్పటి నుంచి ఇళ్లకు కొత్తాకు ఎత్తుతారు..
ఇప్పుడంటే కాంక్రీటు జంగిల్.. అన్నీ శ్లాబులూ.. అపార్టుమెంట్లూనూ..
మచ్చుకు ఒక్క తాటాకు ఇల్లూ కనిపించదు..
అయితే మా ప్రాంతాల్లో ఇంకా అక్కడక్కడా పూరిళ్లు వున్నాయి..
వాటికి కొత్తాకులు వేస్తారు..
ఇదిగో సీతారామ కల్యాణానికి కొత్త తాటాకులు అప్పుడే గ్రామాల్లో వచ్చేశాయి..
ఏడ్లబళ్లపై తరలి అచ్చేశాయి..
అన్నట్టు కొత్త తాటాకులతోనే విసన కర్రలు చేసేది.. పాతపడితే అవి ఒంగవు మరి
--నాగ్
ఫొటో : సీతారామ కల్యాణానికి పందిరి కోసం తెచ్చిన
కొత్త తాటాకులు

No comments:

Post a Comment