Saturday, 16 July 2016

శివుని తలపై గంగమ్మ Durgada

శివుని తలపై గంగమ్మ అందరికీ తెల్సినదే.
చిత్రపటాల్లో మినహా ఆ గంగమ్మ మనకు ఎక్కడా శివుని శిరస్సుపై కనిపించదు
కానీ మా పిఠాపురం దగ్గర గ్రామం దుర్గాడలో మాత్రం ఆ అద్భుతం గోచరిస్తుంది
ఇక్కడి శివ పంచాయతన సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వారి శిరస్సుపై కొలువు తీరిన గంగమ్మను చూడొచ్చు.
ఇక్కడ శివలింగంపై మరో శిల వుంటుంది. అదే గంగమ్మ
సుమారు 50 ఏళ్ల క్రితం దుర్గాడ ప్రాంతం అంతా కరువు కాటకాలతో వుండేదట.
సహజంగానే మెట్ట ప్రాంతం ఆపై వర్షాలు లేక పంటలు పండక ప్రజలు కష్టాలు పడేవారట.
ఆ సమయంలో ప్రస్తుతం ఈ శివలింగం ఆలయానికి ఎదురుగా గల కోనేటి లో లభించిందట. ఆ శివలింగంపై మరో రాయి వుండటం గ్రామస్తులు గమనించారు.
దైవజ్ఞులు, వేద పండితులు, గ్రామ పెద్దలు  ఆలోచించి శివాలయం నిర్మించారట
శివలింగంపై మరో రాయి శాస్త్ర సమ్మతం కానందున ఆ రాయిని కోనేటిలోనే వదిలేసి
శివలింగాన్ని మాత్రం ప్రతిష్టించారట. అయితే తెల్లారే సరికి చిత్రంగా ఆ శిల మళ్లీ శివలింగపైన అలాగే  వుందట. పురోహితులు ఆలోచించి ఆ రాయిని  దగ్గరలోని అన్నవరం పంపానదిలో నిమజ్జనం చేసి వచ్చారట. అయినా మళ్లీ రాయి శివలింగంపై ప్రత్యక్షం కావడంతో  పండితులు ఆ రాయి గంగాదేవిగా భావించి అలాగే వుంచి అభిషెకాలు నిర్వహించారట. శాస్త్ర రీత్యా..   సూర్యుడు, లక్ష్మీనారాయణుడు, ఉమా దేవి, గణపతి విగ్రహాలను ప్రతిష్టించి శివ పంచాయతన క్షేత్రం చేశారట.
అప్పటి నుంచీ గ్రామంలో కరువు దరి చేరలేదు. గ్రామంలో సుఖశాంతులు వెలసిల్లాయి. '
గ్రామస్తులే చందాలతో ఆలయాన్ని అభివృద్ది చేసారు.
ఇప్పటికీ ఆలయంలో శివలింగంపై మరో రాయి కనిపిస్తుంది
ప్రతి ఏటా తొలి ఏకాదశికి ఇక్కడ సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. గ్రామం మొత్తం ప్రతి గడప నుంచీ ఒక బిందెతో మహిళలు నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం నిర్వహిస్తారు.
ఎన్ని రాజకీయా పార్టీలు, విభేదాలు వున్నా శివాలయం విషయంలో గ్రామస్తులు అందరూ ఏకమవుతారు. తలో చేయి వేసి ప్రతి క్రతువూ ఘనంగా నిర్వహిస్తారు.
ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తులు ఆలయాన్ని చక్కగా అభివృద్ధి చేస్తున్నారు.
స్వామి వారిని వాళ్లు అలంకరించే తీరు ఆ శ్రద్ద అద్భుతం అనిపిస్తుంటుంది
ప్రతి విశేషమైన రోజునా వారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఆలయం వైపు రప్పిస్తారు.
ఈ క్రమంలోనే ఈ రోజు స్వామి వారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పండుగ వాతావరణం నెలకొంది
ధన్యవాదాలు
ఫోటోలు : దుర్గాడ సహస్ర ఘటాభిషేకం దృశ్యాలు
నోట్ : నచ్చితే షేర్ చేయండి కాపీ మాత్రం చేయొద్దు
5 comments:

 1. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ
  జాతీయ రహదారి 214 పైన వుంది
  కాకినాడ - కత్తిపూడి రోడ్డులో చేబ్రోలు దాటాక కుడివైపు రోడ్డులో ఓ మూడు కి. మీ ప్రయాణిస్తే దుర్గాడ గ్రామం వస్తుంది.
  ఇక్కడికి వెళ్లాలంటే ఆటో లేదా ప్రయివేటు వాహనం పైన మాత్రమే వెళ్లగలం. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు.
  అందుకే ఈ క్షేత్రం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు
  ధన్యవాదాలు

  ReplyDelete
  Replies
  1. Thank you very much for your article. can i add link to wikipedia https://en.wikipedia.org/wiki/Durgada

   Delete
 2. ధన్యవాదాలు Durga vara Prasad sir

  ReplyDelete
 3. హర హర మహా దేవా శంబో శంకర

  ReplyDelete