Tuesday, 12 April 2016

ఇదేమిటో చాలా మందికి తెలీదు..
బహుశా చూసి కూడా వుండి వుండరు.. smile emoticon
ఇదేమిటో చాలా మందికే తెలిసే వుంటుంది
చూసే వుంటారు.. grin emoticon
తెలిసిన వారు తెలియని వారికి చెప్పండి..
చూసిన వాళ్లు ఇదేేమిటో చెప్పండి.. 
గంజాయి tongue emotico
n

--నాగ్
ఫోటో : పిఠాపురం పోలీసు స్టేషన్లో తీసింది

విగ్రహ ప్రతిష్టాపనా కార్యక్రమం

గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సీతారామ లక్ష్మణ, ఆంజనేయ
పాలరాతి విగ్రహాలను తీసుకొచ్చి అధివాస క్రతువులు ప్రారంభించారు..
శిల్పి తయారు చేసిన విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేయడానికి ముందు వాటికి
అధివాస కార్యక్రమాలు చేపడతారు..
జలాధివాసం : విగ్రహాలను ఒక రోజంతా (పగలు రాత్రి) పూర్తిగా జలంలో వుంచుతారు
క్షీరాధివాసం : విగ్రహాలను ఆవు పాలలో వుంచుతారు
ధాన్యాధివాసం : కొత్త ధాన్యంలో విగ్రహాలను నిద్రచేయిస్తారు
పుష్పాధివాసం : పూర్తిగా పుష్పాలలో వుంచుతారు
అనంతరం అధివాస హోమాలు నిర్వహిస్తారు
ప్రాణ ప్రతిష్ట అనంతరం విగ్రహాలను ప్రతిష్ట చేస్తారు..
విగ్రహ ప్రతిష్టాపనా కార్యక్రమం జరుగుతోంది..
--నాగ్
ఫోటో : సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహాలకు జలాధివాసం చేస్తున్న భక్తులు

ద్రాక్షారామ పంచారామ భీమేశ్వరస్వామి వారి నిజరూప దర్శనం


ద్రాక్షారామ పంచారామ భీమేశ్వరస్వామి వారి నిజరూప దర్శనం
14 అడుగుల స్వామి వారి విశ్వ లింగరూపం
పాదాల నుంచి స్వామి వారి రూపం
ఆ పైనా
స్వామి వారి ముఖం వుంటుంది
--నాగ్
నచ్చితే షేర్ చేయండి..
కాపీ చేయొద్దు..

కొత్త తాటాకులు

వసంతం వచ్చిందనడానికి
మామిడి పూత..
కోయిల కూత..
కురిసే వెన్నెల..
మలయ మారుతం..
ఇవే కాదు
వెండి రేకుల్లా.. కొత్తందాలని పరిచే తాటాకులూ గురుతులే..
అవును చైత్రమాసంలో కొత్త తాటాకులొస్తాయి..
వేసవి కదా.. కొత్త తాటాకులు చల్లదనాన్నిస్తాయి.. కొత్తందాలు సంతరిస్తాయి..
తాటాకులకీ ఓ వాసనుంది.. చక్కని.. కమ్మని సువాసన..
తాటాకులకీ శబ్దం వుంది.. తొలి వాన చినుకుల చిటపటలకు అది స్పందిస్తుంది..
రాములోరి కల్యాణానికి ఆ కొత్త ఆకులతో పందిరేసి..
ఇక అప్పటి నుంచి ఇళ్లకు కొత్తాకు ఎత్తుతారు..
ఇప్పుడంటే కాంక్రీటు జంగిల్.. అన్నీ శ్లాబులూ.. అపార్టుమెంట్లూనూ..
మచ్చుకు ఒక్క తాటాకు ఇల్లూ కనిపించదు..
అయితే మా ప్రాంతాల్లో ఇంకా అక్కడక్కడా పూరిళ్లు వున్నాయి..
వాటికి కొత్తాకులు వేస్తారు..
ఇదిగో సీతారామ కల్యాణానికి కొత్త తాటాకులు అప్పుడే గ్రామాల్లో వచ్చేశాయి..
ఏడ్లబళ్లపై తరలి అచ్చేశాయి..
అన్నట్టు కొత్త తాటాకులతోనే విసన కర్రలు చేసేది.. పాతపడితే అవి ఒంగవు మరి
--నాగ్
ఫొటో : సీతారామ కల్యాణానికి పందిరి కోసం తెచ్చిన
కొత్త తాటాకులు

రామా ఫలం


రామా ఫలం ఎరుపు రంగులో నున్నగా వుండే రామా ఫలం ద్రాక్షారామ వెళ్లే దారిలో ఎక్కువగా కనిపిస్తోంది.. రోడ్డుపై పోగులు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఒక్కో పండూ రూ.15/- అయితే చిన్నవి ఇంకా ధర తగ్గుతున్నాయి..
దీన్ని నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారట.
తియ్యని వాసనతో మధురమైన రుచిని కలిగి ఉండే రామా, సీతా, అక్ష్మణా ఫలాలు నిజానికి మన దేశానివి కాదట ఐరోపా దేశాల నుంచి పోర్చుగీసు వారు 16వ శతాబ్దంలో తీసుకొచ్చారట.
వారికి మన ఐతిహాసం రామాయణం మీద వున్న అనురక్తితో ఒకే జాతికి చెందిని ఈ మూడు ఫలాలకీ స్థానికంగా వారి పేర్లు పెట్టారు.. , రామా ఫలంలో గుంజు ఎక్కువ పిక్కలు తక్కువ . మిగిలినవాటితో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయట.
అలసిన శరీరానికి చాలా త్వరగా ఉత్తేజాన్ని ఇస్తుందట.
మరో విశేషం ఏమంటే.. ఈ ఫలంలో క్యాన్సర్ కణాలను నివారించే లక్షణాలు వున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే మలేరియా ను నివారించే గుణం కూడా ఈ పండుకి ఎక్కువే. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది. పోషకాలు, పీచు, సి విటమిన్, బి - కాంప్లెక్స్ సమృద్ధిగా వుంటుందట. పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుందట. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుందని గూగుల్ సమాచారం.
ప్రస్తుతం ఇవి మన సూపర్ మార్కెట్లలో కూడా దొరికేస్తున్నాయి అనుకోండి..
నేను మాత్రం ద్రాక్షారామా రోడ్డులో కొన్నాను
--నాగ్
నోట్ : కాపీ వద్దు.. షేరే ముద్దు.

ద్రాక్షారామం.. సర్ప శిల్పం..


భారతీయ శిల్ప కళా వైభం మన ఆలయాల్లో ప్రతిబింభిస్తూ వుంటుంది..
నిజానికి మన ఆలయాలను కాపాడుకోవడం అనేది
ఆధ్యాత్మికంగానే కాదు.. మన కళలను సంరక్షించుకోడానికి కూడా..
ప్రతి ఆలయంలో ఏదో ఒక ప్రత్యేకత..
నాటి మహానుభావుల గొప్పతనం..
కళా ఔన్నత్యం గోచరిస్తాయి..
అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తాయి..
ఆశ్చర్యం గొలుపుతాయి..
అబ్బురం అనిపిస్తాయి..
ద్రాక్షారామం ఆలయం పశ్చిమ గోపురం స్థంభం మీద..
ఈ శిల్పం అధ్బుతమనిపించింది..
మొత్తం రాయి మీద.. చిన్న గీతలా సర్పం..
పట్టి చూస్తే..
తడిమి చూస్తే గానీ కనిపించనంతటి చిన్న సర్ప శిల్పం..
ఆ సర్పం కోసం శిల్పి మొత్తం రాతిని చెక్కాలి..
చిన్నపాటి తేడా వచ్చినా..
శిల్పి కష్టం బూడిదలో పోసిన పన్నీరే..
అది చెక్కడానికి ఎంత నిష్ట.. శ్రద్ద.. ఓపిక కావాలో కదా..
మహానుభావులు అందించిన సంపదని కాపాడుకోడానికి ఆ మాత్రం శ్రద్ధ, ఓపిక మనకి కనిపించడం లేదు..
ఈసారి ద్రాక్షారామం వెళ్తే.. తప్పకుండా ఈ శిల్ప కళా వైభవాన్ని చూడండి..
భక్తి సరే..
కూసింత కళా పోసన కూడా వుండాలి కదా..
--నాగ్
ఫోటో : ద్రాక్షారామ దక్షణ గోపురం స్థంభంపై శిలా సర్పం.. నా వెనుక వున్న స్థంభం పై
నోట్ : కాపీ వద్దు.. షేరే చేయండి.

Saturday, 16 January 2016

కోస..
పందెం బరిలో రక్తమోడుతూ వీరమరణం పొందిన కోడిపుంజు మాంసాన్నే కోస అనిపిలుస్తారు.
ఈ మాంసం చాలా రుచిగా వుండటంతో మాంస ప్రియులు ఈ మాంసం కోసం ఎగబడతారు. ఒక్కో కోస రూ.5వేలకు పై మాటే.. పైగా ఎవరూ కోసను అమ్మరు కూడా.
వాటిని నాయకులు, ఉన్నతాధికారులకు బహుమతులుగా ఇస్తారు. అచ్చంగా మన గోదావరి పులస మాదిరి.
పందెంలో వీరోచితంగా పోట్లాడి ఓడిన కోడిని అక్కడే ఈకలు దూయించేస్తారు.. కొబ్బరాకుల మంటపై కాల్చేసి కావల్సిన వారికి అమ్మేయడం లేదా బహుమతిగా ఇచ్చేయడం చేస్తారు.
ఇక కోసకు ఇంత రుచి ఎక్కడనుంచి వచ్చిందీ అంటే.. సంక్రాంతికి ఏడాది ముందు నుంచే కోడి పందెం రాయుళ్లు వాటిని బాగా పెంచుతారు. జీడిపప్పు, బాదం పప్పు. ఉల్లి ముక్కలు గంట్లు, తవుడు పెట్టి బాగా మేపుతారు. అంత తిన్న కోడిపుంజు కొవ్వు పట్టకుండా ప్రతిరోజూ ఈత పరుగు వంటి వ్యాయామాలు చేయిస్తారు. దీంతో కోడిపుంజుకు మాంసం బాగా చేరుతుంది.
సహజంగానే నాటుకోడి రుచే వేరు. అలాంటిది ప్రత్యేకంగా పెంచిన కోడి పుంజు మాంసం ఇంకా రుచిగా వుంటుంది కదా..
అందుకే దానికి అంత రేటు.
పందెంలో కోడి పుంజు గెలిచినా.. ఓడినా కోస కావల్సిందే..
సాదారణంగా గెలిచిన కోడి యజమానికి ఓడిన పుంజును ఇచ్చేస్తారు..
చాలా పందేలు ఇలా కోసల కోసమే వేస్తారు కూడా..
ఇదిగో ఇక్కడ ఫోటోలు చూడండి.. కోడిని మేపడం దగ్గర నుంచి కూరగా మారే వరకూ క్రమం ఇదే..
--నాగ్
ఫోటో లు : పిఠాపురం






లో కోడి పందేలు సమయంలో తీసినవి
(నోట్ : ఈ పోస్టు పెట్టానని కోడి పందేలను సపోర్టు చేస్తున్నట్టు కాదు.. కేవలం తెలియని మిత్రులకు  సమాచారం కోసం మాత్రమే ఈ పోస్టు)