Wednesday 16 September 2015

చిటపట చినుకులు..

చిటపట చినుకులు..
ఒంటిపై అక్యుపంచర్లా హాయిగా
పుడమి తల్లి తలారా స్నానం చేసి..
చెట్ల కొమ్మల జుత్తును ఆరబోసుకుంటే..
కురుల చివరల నుంచి జారిని నీటి చుక్కల్లా ..
ఆకుల చివర నుంచి జారుతున్న నీరు..
దూరంగా చినుకు పడి మాగాణీ వాసన్
చినుకు పడిన చోట పులకింత..
ఎడబాటు తర్వాత కలిసిన..
ఆత్మీయ పలకరింపు..
గాలిలో ఏదో తెలియని ప్రేమ.. మత్తు
నీటిలో టప్..టప్.. వర్షపు చుక్కలు
వెండి దారాల్లా.. మెరుస్తూ..
ఇంటి చూరు నుంచి వర్షపు దార.
గుండు టోపీలు పెట్టుకున్న సిపాయిల్లా..
నీటిలో నీటి బుడగల వేగం
పగబట్టిన పాము పిల్లల్లా..
జర జరా నీటి పాయలు..
వర్షపు నీటి కాలువల్లో తేలియాదుతూ..
కాగితపు పడవలు..
పిల్లల కేరింతలకు పోటీగా
వర్షం హోరు..
చిటపట చిటపట..

--నాగ్
 ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment