Wednesday 16 September 2015

మందు కావాలి.

మందు కావాలి..
నాకు మందు కావాలి..
కిక్కు.. ఖర్చు లేకుండా..
కష్టాలు మరిపించే మందు కావాలి

కష్టమొచ్చినా.. కన్నీరు రాని మందు..
సుఖంలో కష్టం గుర్తొచ్చే మందు..
నెలాఖరున జేబు ఖాళీ అయినా ధీమా ఇచ్చే మందు
ఆఫీసులో బాస్ తిట్టినా నవ్వొచ్చే మందు
స్నేహితులు మోసగిస్తున్నారని తెలిసినా..
.. వారితో కలిసి దమ్ము కొట్టగలిగే మందు
ఇజాలు నచ్చకున్నా.. వారికంత సీను లేదని తెలిసినా..
గొంతు.. చొక్కా చింపుకునే అభిమానం వచ్చే మందు
కావాలి.. కావాలి ఇస్తారా

కరెంటు కోత ఎంతున్నా..
సర్కారోడిని తిట్టకుండా వుండగలిగే మందు
ఐదేళ్ళ కోమాటే కనిపించినా..
ఐదొందలిచ్చుకుని..
మా కులపోడికే ఓటు వేయించే సిగ్గులేని మందు
ప్రేమించింది మనసులోనే వున్నా..
కట్టుకున్నదాన్ని గుండెలపై పెట్టుకోగలిగే మందు
పిల్లలకి పుస్తకాలు కొనే తాహతు లేకున్నా..
వాళ్లు కలెక్టర్లు కావాలని మొక్కుకునే ఆశ ఇచ్చే మందు
వీడు అసమర్థుడు అని ఎవరైనా అన్నా...
అదేదో మెచ్చుకోలు అనుకోగల మందు..

నాకు లేకపోయినా..
ఎదుటోడికీ లేదని ఆనందం కలిగించే మందు
మధ్య తరగతి కుటుంబాలు నిత్యం తాగే మందు..
నాకు కావాలి... ప్లీజ్
మిత్రుల్లారా ఎవరైనా ఇస్తారా..

---నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment