Wednesday 16 September 2015

అపరిచితులం మనం

ఒకే నావపై అపరిచితులం మనం
ఒకే గదిలో ;పరాయివాళ్లం
నా మాట నీకు వినిపిస్తుంది..
నీ గోల నాకు తెలుస్తోంది...
అయినా పట్టించుకోము..
ఎంతసేపిలా..
ఒప్పందానికొద్దామా..
అహం చాప చుట్టేసి..
అటకమీద పారేద్దామా..
మొహమాటాన్ని మడిచేసి..
మంచం కింద తోసేద్దామా..
చందమామకు కబురెట్టి
వెన్నేలను పండిద్దామా.
చుక్కలను వలవేసి..
మల్లెపందిరికి చుట్టేద్దామా..

నీ పెదవి దాచిన నవ్వు..
కళ్లలోంచి తొంగి చూస్తుంటే..
నా గుండే క్షణం ఆగి కొట్టుకుంటోంది
నీ బుంగమూతి అర్థం..
అవుననా.. కాదనా..
నువ్వు కాదంటే.. అవుననేగా
అవునంటే..
అడ్డేముంది..!

...నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment