Wednesday 16 September 2015

ముఖాలు డమ్మీ..


ముఖాలు డమ్మీ..
అడ్రస్ లు డమ్మీ..
ప్రేమలు.. పలకరింపులు డమ్మీ..
మొహమాటం లైకులు..
పొగడ్తల కామెంట్లు..
చాటింగ్ ల ఆప్యాయతలు
అన్నీ..అన్నీ డమ్మీ
నీ అమాయకత్వం ఒకటే నిజం..
ఇక్కడ
లక్ష్యం ఏమో కానీ..
దుర్లక్షణం మాత్రం బయట పడుతుంది..
పాత్రమెరిగి దానం..
ప్రొఫైల్ ఎరిగి స్నేహం..
అవసరమే..
చాటింగ్ లు మనిషి గుణం చెప్పవు..
పోస్టింగులు మంచితనానికి
సర్టిఫికెట్లు కావు..
ఏ కామెంట్ వెనుక ఏ గూఢార్థం వుందో..
ఏ షేర్ వెనుక ఏ మర్మముందో..
ఏమో..
గంగి గోవులే కాదు..
గోముఖ వ్యాగ్రాలూ వుంటాయ్ నేస్తం..
జర భద్రం..


--నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment