Wednesday 16 September 2015

ప్రకృతి జూదంలో పాచిక రైతే..

అరక మూలన పెట్టి..
నెత్తిన తుండు కట్టి..
కళ్ళకు చేతులడ్డు పెట్టి..
దిగాలుగా రైతన్న..
పొలం మీదుగా మేఘాల గుంపు
చినుకు రాలలేదు..
తొలకరి కోసం నోరు తెరిచిన నేల
చినుకు రాల లేదు..
పోలేరమ్మకు వేట పోతు మొక్కు
చినుకు రాల లేదు..
కప్ప జంటకు మేళాల పెళ్లి..
అంతే.. నీటి చుక్క జాడ లేదు
కాపు కంటి కన్నీరు..
ఏడ్చి వ్యవసాయం సాధ్యమా..
గులకరాళ్ళు వెస్తే..
కాకి దాహం తీరుతుందా..?
వరుణ జపాలు..
సహస్ర ఘటాభిషేకాలు..
మేఘమధనం చేస్తాయా..
ఏమో..
ప్రకృతి జూదంలో పాచిక రైతే..
ఎండిన కాలువలో పారేది
రైతన్న కన్నీరే..

--నాగ్

No comments:

Post a Comment