Wednesday 16 September 2015

వద్దు.. వద్దనుకుంటూనే..


వద్దు.. వద్దనుకుంటూనే..
నీ వైపు చూస్తాను.
కాదు.. కూడదు అనుకుంటూనే
చిరునవ్వు నవ్వుతాను..
నువ్వు తిరిగి చూడవని తెలిసినా..
ఎదురుచూస్తాను..
నువ్వు కర్కశంగా తొక్కి వెళ్తావని తెలిసినా
నా హృదయం పరుస్తాను..
నీ ఛీత్కారంతో గుండె బద్దలైనా..
నిన్నే పలవరిస్తాను
నీ మాటల శూలాలు నన్ను గుచ్చినా..
తిరిగి లేస్తాను
నీ నుంచి ఎన్ని అవమానాలెదురైనా..
భరిస్తాను..
ఇవన్నీ..
నీ మీద ప్రేమ వున్నప్పుడే చేయగలను
ఆ ప్రేమే లేదంటే..?

అవును ఎందుకు లేకుండా పోతుంది..
గొడ్డలితో నరికినా గంథం సువాసించదూ..
దారంతో గొంతు నులిమినా మల్లె వికసించదూ..
ప్రేమా అంతే..

--నాగ్

No comments:

Post a Comment